సంగారెడ్డి: టీచర్ ను బెదిరించి దోపిడి చేసిన కేసులో ముగ్గురు అరెస్ట్ : కేసు వివరాలను వెల్లడించిన తూప్రాన్ డిఎస్పి
ఉపాధ్యా యుడిని బెదిరించి డబ్బులు దోచుకున్న కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు.నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మూడు రోజుల క్రితం ఉపాధ్యా యుడిని బెదిరించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాయి కుమార్, అనిల్, కుమార్ అనే పాత నేరస్తులను శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ జాన్ రెడ్డి, ఎస్సై రంజిత్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.