శ్రీశైలం: మహానంది దేవాలయంలో డబ్బుల కోసం భక్తులను ఇబ్బంది పెడుతున్నారు విహెచ్పి కార్యదర్శి కిషోర్ ఆగ్రహం
మహానందీశ్వర స్వామి దేవస్థానంలో నవగ్రహ దీపారాధన వ్యవహారంపై వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి కిషోర్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల సౌకర్యాలను పక్కనబెట్టి ఆదాయానికే ప్రాధాన్యం ఇస్తున్నారని దేవాదాయ శాఖ అధికారులపై మండిపడ్డారు.సాధారణ దర్శనానికి వచ్చే భక్తులను దర్శనం అనంతరం నేరుగా బయటకు పంపకుండా, కేవలం నవగ్రహ దీపారాధన టికెట్ల ఆదాయం కోసం అవసరం లేకపోయినా 600 మీటర్ల దూరం ఆలయం చుట్టూ తిప్పుతున్నారని ఆరోపించారు.దీంతో వృద్ధులు, మహిళలు, .చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.నవగ్రహాల వద్ద ఒకేసారి వందలాది, వేలాది దీపాలు వెలిగించడం వల్ల విగ్రహాలు దెబ్బతింటాయన్నారు.