తమ స్థలాలను కబ్జా చేసి నిత్యం కొంతమంది టీడీపీ నాయకులు ఇబ్బందులు పెడుతున్నారు : బాధితుడు సాకే గురుమూర్తి
Anantapur Urban, Anantapur | Apr 1, 2026
తమ స్థలాలను కబ్జా చేసి నిత్యం కొంతమంది టీడీపీ నాయకులు ఇబ్బందులు పెడుతున్నారని అనంతపురం ఎరుకల కాలనీకి చెందిన సాకే గురుమూర్తి, మల్లిక, అంజినమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఐదు గంటల సమయంలో ప్రెస్ క్లబ్ లో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాచానపల్లి పొలం సర్వేనెంబర్ : 183 లో లెటర్ 1, 2 లో ఫ్లాట్ నెంబర్లు 14, 15 లో 10 సెంట్ల స్థలాన్ని చిన్న పెద్దన్న అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు తమ స్థలాల్లో హద్దులు ఏర్పాటు చేయటానికి వెళితే ఎన్ఆర్ కాలనీకి చెందిన టిడిపి నాయకులు వన్నూరు స్వామి, లాలు, షరీఫ్, ఇమామ్, వారాది అనే వ్యక్తులు దాడులకు పాల్పడుతున్నారు.