శ్రీశైలం: కరివేన గ్రామం వద్ద నేషనల్ హైవేపై వెలగని వీధిలైట్లు. ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు
ఆత్మకూరు మండలం కరివేన గ్రామం వద్ద నేషనల్ హైవే పై ఏర్పాటుచేసిన వీధిలైట్లు ఒకరోజు వెలిగి ఒక రోజు వెలుగుకు పోతున్నడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకరోజు ఒక సైడు ఒకరోజు ఒక సైడు వేస్తుండడం లేదా మరో రోజు పూర్తిగా బంధిస్తున్నాడంతో వాహనదారులు గ్రామస్తులు ఇబ్బందులు గురవుతున్నారు. కేవలం విద్యుత్ పొదుపు చేయడానికి ఈ విధమైన చర్యలు చేపడుతున్నట్లు గ్రామస్తులు తెలియజేశారు .ఇప్పటికైనా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం వీధిలైట్లు వెలిగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.