శ్రీశైలం: శ్రీశైలం నియోజకవర్గం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్, ఎంపీపీ తో సహా 150 మంది ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలో చేరిక
ఆత్మకూరులో వైసీపీకి బారి షాక్ తగిలింది. ఆత్మకూరు మండల ఎంపీపీ తిరుపాలమ్మతో పాటు కరివేన గ్రామానికి చెందిన 70 కుటుంబాలు, వెంకటాపురానికి చెందిన 80 మైనార్టీ కుటుంబాలు మొత్తం 150 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. గురువారం ఆత్మకూరులో జరిగిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల కార్యక్రమంలో భాగంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు