శ్రీశైలం: శ్రీశైలంలో అటవీ శాఖ వినూత్న ప్రయోగం డ్రోన్ ద్వారా 1లక్ష 30వేల సీడ్ బాల్స్ చల్లే కార్యక్రమానికి శ్రీకారం
శ్రీశైలం అటవీ ప్రాంతంలో వృక్ష సంపద పెంపునకు అటవీశాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. డ్రోన్ సాయంతో 130 హెక్టార్లలో 1.30 లక్షల సీడ్ బాల్స్ చల్లి అటవీ విస్తరణకు శ్రీకారం చుట్టింది.శ్రీశైలం, పెద్ద చెరువు అటవీ ప్రాంతాల్లోని ఖాళీ భూముల్లో మేడి, వేప, రావి వంటి స్థానిక జాతుల విత్తనాలతో తయారు చేసిన సీడ్ బాల్స్‌ను ప్రత్యేక డ్రోన్ ద్వారా చల్లుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో విత్తనాలు త్వరగా మొలకెత్తి పచ్చని వృక్షాలుగా ఎదుగుతాయని అధికారులు తెలిపారు. శ్రీశైలం రేంజర్ పరవేశ్వరులు, డిప్యూటీ రేంజర్ కిషోర్ ,ఎఫ్‌ఎస్‌ఓ మదన్, బీట్ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు