రాప్తాడు: రాప్తాడు లో స్వయం సహాయక సంఘ సభ్యులకు 32, కోట్ల 47 లక్షల 50వేల రూపాయలు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత.
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత మన డబ్బు మన లెక్క కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘ సభ్యులకు మెగా చెక్కును పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడులో 636 మహిళా సంఘాలకు 380 మంది సభ్యులకు 32 కోట్ల 47 లక్షల 50 వేల రూపాయల మెగా చెక్కును మహిళా సంఘాలకు పంపిణీ చేయడం జరిగిందని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి లోకి రావాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘ సభ్యులు డిఆర్డిఏ అధికారులు టిడిపి నేతలు పాల్గొన్నారు.