దొడ్లేరు గ్రామంలో వృద్ధురాలిపై హత్యాయత్నం
క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో గురువారం తెల్లవారుజామున వృద్ధురాలిపై హత్యాయత్నం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. దొడ్లేరు గ్రామానికి చెందిన జమాల్బీ నిద్రిస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చీరతో కాళ్లు, చేతులు కట్టివేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.