జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీకి చెందిన ఈగ మొగిలి అనే వ్యక్తి తన యొక్క ఎక్సెల్ ద్విచక్ర వాహనంపై మంజునగర్ వైపు వెళ్తున్నాడు ఈ క్రమంలో మార్గం మధ్యలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి సన్ వాలీ స్కూల్ ఎదుట కింద పడిపోగా అతనికి గాయాలయ్యాయి. ఈమెరకు స్థానికుల ద్వారా ఆదివారం ఉదయం 11:30 గంటలకు తెలిసింది. ఆ వెంటనే గమనించిన స్థానికులు అతని చికిత్స నిమిత్తం 100 పడగల ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.