శ్రీశైలం: నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యంతో NH 340c పై వరుస ప్రమాదాలు
నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యంతో NH 340 సి పై వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత రెండు రోజుల క్రితం ఆట ఆత్మకూరు పట్టణ శివారులో సిద్దపల్లె చౌరస్తాలో రోడ్డు క్రాస్ చేస్తున్న శ్రీనివాస యాదవ్ అనే వ్యక్తి విద్యుత్తు లైట్లు వెలగకపోవడంతో గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. నిన్న రోడ్డు క్రాస్ చేస్తున్న బర్రెలను లారీ ఢీకొనడంతో ఏడు బర్రెలు మృతి చెందాయి విద్యుత్తు లైట్లు రోడ్డు, క్రాస్ చేసే దగ్గర వెలగకపోతున్నడంతో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి .దీనిపై వాహనదారులు గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.