ముధోల్: బాసరలో తరచూ రోడ్డు ప్రమాదాలు: ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించిన ఏఎస్పీ సాయి కిరణ్
Mudhole, Nirmal | Oct 24, 2026 బాసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఏఎస్పీ సాయి కిరణ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రమాదకర బ్లాక్ స్పాట్లను పరిశీలించి, అక్కడ హెచ్చరిక బోర్డులు, రహదారి సూచికలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.