గూడూరు నగర పంచాయతీలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తూ, అభివృద్ధి పనులు చేపట్టాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సిఐటియు కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేవీ నారాయణ మాట్లాడుతూ గూడూరు నగర పంచాయతీలో ప్రజలపై పన్నుల భారం వేశారు కానీ కనీస సౌకర్యాలు కల్పించలేదని విమర్శించారు. ఇప్పటికీ కొన్ని వార్డుల్లో త్రాగునీటి సమస్య ఉందని వేసవిలో మరింత తీవ్రతరం అవుతుందన్నారు. అలాగే డ్రైనేజీ కాలువలు, టాయిలెట్లు, సిసి రోడ్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు.