హత్నూర: నర్సాపూర్ ఇసుక బజారును ఆకస్మికంగా తనిఖీ, ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుకను అందజేయాలి : మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్
ఇంద్ర మహిళల లబ్ధిదారులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీజీఎండిసి నర్సాపూర్ మండలం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇసుక బజారును సోమవారం మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. లబ్ధిదారులు ఒక మెట్రిక్ టన్నుకు రవాణాచార్జి కింద 1200 చెల్లించి పంచాయతీ సెక్రెటరీ ద్వారా టోకెన్ తీసుకొని వస్తే ఉచితంగా అందిస్తామని సద్వినియం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ తాసిల్దార్ అధికారులు పాల్గొన్నారు.