ఎమ్మిగనూరు: గోనెగండ్ల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్ట్ (సంజీవయ్య సాగర్) నుంచి నీటిని విడుదల చేసినట్లు అధికారులు వెల్లడి
గాజులదిన్నె ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలగోనెగండ్ల మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్ట్ (సంజీవయ్య సాగర్) నుంచి సోమవారం నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. పై నుంచి ప్రాజెక్టులోకి నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమై 336 క్యూసెక్కుల నీటిని, గేట్ నంబర్ 4 నుంచి విడుదల చేసినట్టు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహమ్మద్ అలీ తెలిపారు. హంద్రీ పరివాహక ప్రాంత ప్రజలు నీటిలోకి వెళ్లకుండా, మూగజీవాలకు పంపకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.