కొండపి: టంగుటూరు మండలంలో చింత చెట్టుపై నుండి జారిపడి చిరంజీవి అనే యువకుడు మృతి
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మల్లవరప్పాడుకు చెందిన చౌటూరి చిరంజీవి అనే యువకుడు చింత చెట్టుపై నుంచి జారిపడి మృతి చెందాడు. మల్లవరప్పాడు తూర్పు నాయుడుపాలెం గ్రామాల మధ్య ఉన్న చింత చెట్టు ఎక్కి కాయలు కోసే సమయంలో ప్రమాదవశాతు జారిపడి గాయాలయ్యాయి. వెంటనే ఒంగోలులో ఓ ప్రైవేట్ వైద్యశాలకు చిరంజీవిని తరలించి వైద్య చికిత్స అందించే క్రమంలో మృతి చెందాడు.