అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఫుట్బాల్ గ్రౌండ్ సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు, వైస్ ప్రెసిడెంట్ షేక్షావలి ఆధ్వర్యంలో ప్రముఖ శాస్త్రవేత్త యల్లా ప్రగడ సుబ్బారావు 131వ జయంతి, స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ముందుగా యల్లా ప్రగడ సుబ్బారావు, స్వామి వివేకానంద చిత్రపటాలకు కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంయుక్త కార్యదర్శి దేవదాస్, కోశాధికారి జెన్నె కుల్లాయిబాబు మాట్లాడారు