గుంతకల్లు: గుత్తి పట్టణంలోని వక్కలకుంటలో భారీగా మృతి చెందిన చేపలు, దుర్గంధంతో ప్రజలు ఇక్కట్లు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పురాతన వక్కులకుంటలో భారీ ఎత్తున చేపలు మృత్యువాత పడ్డాయి. పట్టణంలోని మన్రో సత్రం సమీపంలోని దాసరి కాలనీకి అనుకుని ఉన్న కుంటలో గురువారం భారీగా మృతి చెందిన చేపలు నీటిపై తేలాడాయి. అటుగా వెళ్ళిన వారు చూడగా ఆ వార్త పట్టణంలో దావనంలా వ్యాపించింది. కాగా కుంటలో మృతి చెందిన చేపలు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా దోమల నివారణ కోసం వదిలిన గంబూషియా చేపలుగా అనుమానిస్తున్నారు. మరి కొందరు మాత్రం ఈ ఏడాది ఎగువ గుత్తి కొండపై భారీ వర్షాలు కురవడంతో కుంట నిండు కుండల మారడంతో మత్స్యకారులు చేపలు వదిలారని అంటున్నారు. రసాయనాలు వదలడంతో చేపలు మృతి చెందాయని కొందరు యువకులు తెలిపారు