శ్రీశైలం: తిమ్మనపల్లె గ్రామంలో తన తండ్రి జ్ఞాపకార్థం మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
వెలుగోడు మండలం తిమ్మనపల్లె గ్రామంలో తన తండ్రి కీ.శే. దివంగత మాజీ మంత్రి బుడ్డా వెంగళరెడ్డి జ్ఞాపకార్థం, సొంత నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తన తండ్రి బుడ్డా వెంగళరెడ్డి సేవాస్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజా సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.