శ్రీశైలం: టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు తిరుమల దేవస్థాన చైర్మన్గా రాజీనామా చేయాలని TDP కి
సద్బుద్ధి కలగాలని వైసిపి పార్టి పూజలు
టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు వ్యవహారశైలి తిరుమల పవిత్రతను దెబ్బతీస్తోందని శ్రీశైలం నియోజకవర్గం YSRCP సమన్వయకర్త శిల్ప భువనేశ్వర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి సద్బుద్ధి కలగాలని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ పిలుపులో భాగంగా నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులోని శ్రీలక్ష్మి జనార్ధన స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. మేరకు శిల్పా భువనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.