కొండపి: సింగరాయకొండ మండలంలోని పాకాల సముద్ర తీరాన్ని ప్లాస్టిక్ రహిత బీచ్ గా తీర్చిదిద్దుతున్నామన్న పర్యాటక శాఖ అధికారులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకాల సముద్ర తీరం ప్లాస్టిక్ రహిత బీచ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పర్యటక శాఖ అధికారులు తెలిపారు. అతి త్వరలో బీచ్ ఫెస్టివల్ జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం అధికారులు సముద్రతీరాన్ని పరిశుభ్రం చేయించారు. చెత్తాచెదారాలు ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఫిబ్రవరి 13, 14వ తేదీలలో రాష్ట్ర ప్రభుత్వం పర్యటకశాఖ ఆధ్వర్యంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు పర్యటకశాఖ అధికారులు వెల్లడించారు.