శ్రీశైలం క్షేత్రంలో ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో శ్రీనివాసరావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసరావు అధికారులతో మాట్లాడుతూ, అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు, మహాశివరాత్రి 15వ తేదీ జరుగుతుందని అదే రోజు ప్రభో త్సం, కళ్యాణం ఉత్సవం, జరుగుతాయని ఆ మరుచటి రోజు రథోత్సవం నిర్వహించబడతాయని అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని అలాగే పాదయాత్ర భక్తులకు భీమునికొలను,నాగలూటి ,పెద్ద చెరువు తదితర ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లను అటవీ శాఖ అధికారులతో కలిసి సమన్వయంతో పని చేయాలని సూచించారు,