అశ్వారావుపేట: కోడిపుంజుల కేసులో దమ్మపేట మండలంలో, ఆంధ్ర పోలీసుల అతుత్సాహం, ఆంధ్ర పోలీసులను అడ్డుకున్న స్థానికులు
దమ్మపేట లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చింతలపూడి పోలీసులు సోమవారం ఓ ఇంటిపై దాడి చేసి రణరంగం సృష్టించారు.సరిహద్దుల్లోని పట్టాయి గుడెం గ్రామంలో ఓ నాలుగు కోడిపుంజులు దొంగతనం కేసులో విచారణ కోసం ఓ యాభై మంది గుంపుతో వచ్చిన ముగ్గురు పోలీసులు ఓ RMP డాక్టర్ ఇంటిపై పడి విధ్వంసం సృష్టించారు.ఇంట్లో మగవాళ్ళు ఎవరూ లేకుండా మహిళ ఒంటరిగా ఉన్నాసరే దౌర్జనానికి దిగిన రౌడీ మూక పోలీసుల సమక్షంలోనే సీసీ కెమెరాలు పగలగొట్టి గలాటా సృష్టించారు