వైకల్యం శరీరానికే తప్ప, సంకల్పానికి కాదని అందరితో సమానంగా ముందడుగు వేస్తూ.. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న దివ్యాంగులందరికీ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్ర దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల ఆత్మ గౌరవాన్ని, అత్మ స్థైర్యాన్ని, సాధికారతను సాధించే దిశగా కూటమి ప్రభుత్వం వారి అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తోంది అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు రూ.6 వేలు పింఛను ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని అన్నారు.