బనగానపల్లె: బనగానపల్లె నియోజకవర్గంలో ఘనంగా ఈస్టర్ పండగ వేడుకలు
బనగానపల్లె నియోజకవర్గంలోని బనగానపల్లె,కోవెలకుంట్ల, అవుకు, కొలిమిగుండ్లలోని పలు ప్రాంతాలలో వెలసిన చర్చిల్లో ఆదివారం ఏసుక్రీస్తు పునరుత్థాన వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. యువకులు పెద్దఎత్తున భాజాభజంత్రీలతో ర్యాలీలు నిర్వహిస్తూ రంగులు చల్లుకొని సంబరాలు చేశారు. ఏసుక్రీస్తు పునరుత్థాన వేడుకలపై చర్చి ఫాదర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, భక్తులకు బోధనలు చేశారు. యువకులు కేరింతలు కొడుతూ రంగులు చల్లుకున్నారు.