కనిగిరి: చంద్రశేఖరపురంలో ఉచిత మెగా వైద్య శిబిరం, రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసిన వైద్యులు
చంద్రశేఖరపురంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరానికి చంద్రశేఖరపురం గ్రామంలోని రోగులు పెద్ద సంఖ్యలో తరలిరాగా, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, డాక్టర్ ప్రతాపరెడ్డి రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలను నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచించారు.