పార్వతీపురం: గరుగుబిల్లిలో ఎండిపోతున్న పంటలు: నీటి కోసం రైతుల ఆందోళన
పార్వతిపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం సీతారాంపురం గ్రామాల్లో నీటి కొరతతో పంటలు ఎండిపోతున్నాయి. జంఝావతి కాలువ నీటిని కొందరు అడ్డుకుంటున్నారని, అధికారులు వెంటనే జోక్యం చేసుకుని నీటిని విడుదల చేయాలని రైతులు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.