శ్రీశైలం: శ్రీశైల దేవస్థానంలో విచ్చలవిడిగా మద్యం బాటిళ్లు, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన భక్తుడు
శ్రీశైలం దేవస్థానంలో విచ్చలవిడిగా మద్యం బాటిల్ ఎక్కడపడితే అక్కడ పడి ఉన్నాయని,ఓభక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.శ్రీశైలం వచ్చిన భక్తుడు టోల్ గేట్ వద్ద అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని,అయినా కూడా శ్రీశైలం దేవస్థానంలోని గెస్ట్ హౌస్ లో ఎదురుగా విచ్చలవిడిగా బీరు బాటిళ్లు మద్యం బాటిళ్లు పడి ఉన్నాయని ఇవి ఎలా వచ్చాయని సెక్యూరిటీ ఏం చేస్తుందని ఇంత పవిత్రమైన శ్రీశైల క్షేత్రంలో ఏదేచ్ఛగా మద్యం రవాణా జరుగుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.