శ్రీశైలం: వర్షాలు బాగా కురవాలని మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో గంగమ్మకు 101 బిందెలతో జలాబిషేకం నిర్వహించిన గ్రామస్తులు
వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని మహానంది మండలం తిమ్మాపురంలో ప్రజలు కప్పను వేలాడదీసి నీళ్లు పోస్తూ ఇంటింటికీ తిరుగుతున్నారు. ఆదివారం గ్రామంలోని తెలుగుపేట బజార్లో కర్రకు వేపాకులు కట్టి మధ్యలో కప్పను వేలాడదీసి ఇలా తిరిగారు. ఇలా పోస్తే వానలు కురుస్తాయని ప్రజలు నమ్ముతారు. ఖరీఫ్ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో సరిగా వర్షాలు కురువక రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. గంగమ్మ తల్లి మమ్మల్ని కరుణించు’ అంటూ గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గ్రామంలో కొలువైన గంగమ్మ తల్లికి 101 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు. సకాలంలో వానలు కురిసి పాడి పంటలు అభివృద్ధి చెందాలని వేడుకున్నారు.