శ్రీశైలం: శ్రీశైలంలో భారీగా మద్యం పట్టివేత ఇద్దరు మహిళల అరెస్టు. రిమాండ్ కు తరలింపు
శ్రీశైలంలో భారీగా మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. శ్రీశైలంలో మద్యం విక్రయించేందుకు బాటిళ్లను తీసుకెళ్తున్న ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్లు సీఐ జీవన్ గంగనాథ్ బాబు తెలిపారు. ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన రమాక్షి, చంద్రమ్మ 120 క్వాటర్ మద్యం బాటిళ్లను శ్రీశైలం తరలిస్తుండగా దాసరి అన్నదాన సత్రం వద్ద పట్టుకొని వాటిని స్వాధీనం చేసుకొన్నామని Ci తెలియజేశారు. వారిని రిమాండ్ కు తరలించామన్నారు. SI సుబ్బారెడ్డి, నాను నాయక్, అమర్నాథరెడ్డి, నాగవేణి ఉన్నారు.