గుంతకల్లు: కార్యకర్తలకు అండగా ఉంటాం, గుంతకల్లులో కార్యకర్తలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి
గుంతకల్లు నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుస్తామని మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో వివిధ ప్రమాదాల్లో గాయపడి ఆసుపత్రులలో చికిత్సలు పొందుతున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే బుధవారం పరామర్శించారు. గుంతకల్లు మండలం పాతకొత్తచెరువు గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి, గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామంలో వెంకటాంపల్లి గ్రామానికి చెందిన బాలుడు కింద పడి కాలు విరిగి ఆసుపత్రిలో వైద్యం పొందుతుండగా మాజీ ఎమ్మెల్యే వారిని పరామర్శించారు.