అచ్చంపేట: అచ్చంపేటలో ఉమామహేశ్వరం ప్రాజెక్టు పనులు చేపట్టాలని డిమాండ్
అచ్చంపేటలో కొమరం భీమ్, పండుగ సాయన్న జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా టీజేఏసీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అచ్చంపేట, లింగాల, బల్మూరు, అమ్రాబాద్ మండలాలకు సాగు, తాగునీరు అందించే ఉమామహేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.