ముమ్మిడివరం: కాట్రేనికోన జడ్పీటీసీ అభ్యర్థిగా దండుప్రోలు భాగిర్తమ్మ నామినేషన్
కాట్రేనికోన జడ్పీటీసీ స్థానానికి టీడీపీ కూటమి అభ్యర్థి దండుప్రోలు భాగిర్తమ్మ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. పల్లం గ్రామం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి, గున్నేపల్లి సత్తెమ్మ తల్లిని దర్శించుకున్న ఆమె, కూటమి నాయకులు మరియు కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.