కొడిమ్యాల: దొంగలమర్రి స్టేజి సమీపంలో గూడ్స్ వాహనం ద్విచక్ర వాహనం ఢీకొని రోడ్డు ప్రమాదం యువకుడికి తీవ్ర గాయాలు
జగిత్యాల జిల్లా,కొడిమ్యాల మండలం,దొంగల మరి స్టేజి దాటినా అనంతరం శుక్రవారం రాత్రి 10 గంటలకి రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన చోటుచేసుకుంది,కరీంనగర్ కు చెందిన కొమరయ్య తన ద్విచక్ర వాహనంపై జగిత్యాలకు వెళ్తుండగా,దొంగలమర్రి స్టేజి దాటి మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న గూడ్స్ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది,దీంతో కొమురయ్యకు తీవ్ర గాయాలయ్యాయి కుడి చేయి పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది,దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన కొమరయ్యను ఇతర వాహనదారుల సహాయంతో 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు,ఇంకా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,