సిద్దిపేట అర్బన్: శిల్పకళ, యాంత్రిక విజ్ఞానానికి ఆది పితామహుడిగా విశ్వకర్మ భావించబడుతారు : మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రతి శిల్పం, యంత్రం, సాంకేతిక పరిజ్ఞానం విశ్వకర్మతోనే మొదలైందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా బుధవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో శ్రీ విశ్వకర్మ మహర్షి చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్,జిల్లా కలెక్టర్ హైమవతి అడిషనల్,కలెక్టర్ గరిమ అగర్వాల్, సీపీ అనురాధ , బీసీ సంక్షేమ శాఖ అధికారులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. విశ్వకర్మ మహర్షి మనకు కర్మయోగం, శిల్పకళ, నిర్మాణ శాస్త్రం, యాంత్రిక విజ్ఞానానికి ఆది పితామహుడిగా భావించబడతారన్నారు. విశ్వకర్మ మహర్షి నిర్మించిన అద్భుతాలు ఎన్నో మనం