శ్రీశైలం: ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలు, చిన్నారుల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు
ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలు, చిన్నారుల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు వడ్ల రామాపురం గ్రామంలో ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి మహిళల భద్రత, శక్తి యాప్ ప్రయోజనాలు, సైబర్ క్రైమ్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, బాల్య వివాహాల నియంత్రణ, పోక్సో చట్టం, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాలు, కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, చిన్నారుల రక్షణ కోసం రూపొందించిన శక్తి యాప్‌ను ప్రతి మహిళ తమ సెల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.