ఆత్మకూరు పట్టణంలో సాధారణ స్థితికి పెట్రోల్ బంకులు. బంకులలో సమృద్ధిగా పెట్రోల్ డీజిల్ నిల్వలు
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో పెట్రోల్ బంకుల పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. గత ఐదు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే నేడు బుధవారం నుంచి బంకుల వద్ద పరిస్థితి చక్కబడింది.పెట్రోల్, డీజిల్ దొరకదన్న వదంతులు వ్యాపించడంతో వాహనదారులు బంకుల వద్ద క్యూలు కట్టి, అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేశారు. దీనివల్లే తాత్కాలిక కొరత ఏర్పడిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకుని సరఫరాను సమన్వయం చేయడంతో ప్రస్తుతం అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి.