హిందూపురం సూగూరులో పి.ఎమ్. సూర్య ఘర్ సోలార్ ప్యానెల్స్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్
హిందూపురం పట్టణంలో సూగూరులో పి. ఎమ్. సూర్య ఘర్ పథకం ద్వారా ఒక ఇంటి పైన ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మునిసిపల్ చైర్ పర్సన్ డి.ఈ. రమేష్ కుమార్, మునిసిపల్ కమిషనర్ మల్లికార్జున, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతుంది. ప్రధానంగా కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇంటిపై సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి ఈ పథకం కింద ప్రభుత్వం 40% సబ్సిడీ ఇస్తుంది. సోలార్ ప్యానెల్స్ పెట్టుకున్న తర్వాత 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ పొందవచ్చు.