ఖానాపూర్: పెంబి మండలం నాగాపూర్ లో నూతన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
నిర్మల్ జిల్లా పెంబి మండలం నాగాపూర్ గ్రామంలో కొత్తగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని వసతులు, పిల్లలకు అందుతున్న ఆహారం మరియు విద్యా బోధన తీరును పరిశీలించారు.