విశాఖపట్నం: క్రీడా కోటలో పారా క్రీడాకారులకు DSCలో ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు
క్రీడా కోటలో పారా క్రీడాకారులకు డీఎస్సీలో ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు మంగళవారం పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద భారీ కేక ని కట్ చేసి వితరణ చేశారు.కార్యక్రమం లో శాప్ డైరెక్టర్ ఎం దుర్గ రమేష్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేసిన మెగా డీఎస్సీ లో క్రీడాకారుల కోసం క్రీడాకోటాలో మూడు శాతం రిజర్వేషన్ అమలు చేసి నియామకంలో ప్రాపార క్రీడాకారులకు జిఓ నంబర్ నాలుగులో స్థానం కల్పించిన కూటమి ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చేశారు.