హిందూపురంలో దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా కాల్చి ఆనందంగా పండుగ జరుపుకున్న ప్రజలు
సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం వ్యాప్తంగా దీపావళి పండుగ సందర్భంగా అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు హిందూపురం ఎంజిఎం గ్రౌండ్లో ఏర్పాటుచేసిన బాణాసంచా దుకాణాల వద్ద చిన్నల్లు పెద్దలు కొనుగోలు చేసి పిండి వంటలతో భోజనాలు చేసి కేరింతలు కొడుతూ సాయంత్రం బాణాసంచా కాల్చారు. ఇంటి చుట్టూ దీపాలు ఉంచి సందడి చేశారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దీపావళి పండుగ వేడుకలు హిందూపురంలో ఘనంగా జరిగాయి. ఏ వీధులు చూసినా పట్టణంలో చిన్నారులు పెద్దలు అని తేడా లేకుండా బాణాసంచా కాలుస్తూ పిల్లలు కేరింతలు కొడుతూ సంతోషం వ్యక్తం చేశారు.