గుంతకల్లు: పట్టణంలోని వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో "స్టాప్ మైనర్ డ్రైవింగ్" పై మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో స్టాప్ మైనర్ డ్రైవింగ్ కార్యక్రమంపై మైనర్ల తల్లిదండ్రులకు పోలీసులు అవగాహన కల్పించారు. పట్టణంలోని వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో శనివారం జరిగిన కార్యక్రమంలో గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్ మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు భద్రతను పటిష్టం చేయడం, మైనర్ డ్రైవింగ్‌ను పూర్తిగా నిర్మూలించడం లక్ష్యం అన్నారు.