జగిత్యాల: జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు జగిత్యాల విద్యార్థిని బి.సిరి ఎంపిక!
జగిత్యాల జ్యోతి హై స్కూల్ విద్యార్థిని బి.సిరి జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైంది. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-14 పోటీల్లో ప్రతిభ కనపరిచిన సిరి, అక్టోబర్ 24, 25 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే జాతీయ పోటీల్లో పాల్గొననుంది.