శ్రీశైలం: తెలుగోడు పట్టణంలోని చెంచుగూడెంలో 40 లక్షల వ్యయంతో నిర్మించిన అంతర్గత సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బుడ్డా
వెలుగోడు పఠ్టణంలోని చెంచు గూడెంలో రూ.40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. అనంతరం చెంచు గూడెంలో పర్యటించి అక్కడి ప్రజలను ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే భరోసా కల్పించారు.