బోథ్: ఘన్పూర్ అంతర్రాష్ట్ర చెకోపోస్టును తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ గౌష్ ఆలం
మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో బోథ్ మండలంలోని ఘనపూర్ అంతర్రాష్ట్ర చెక్పోస్టును జిల్లా ఎస్పీ గౌష్ ఆలం గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల్లో ప్రభావితం చేసే డబ్బు, మద్యం, ఇతర బహుమతి వస్తువులను రవాణా కాకుండా 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని సూచించారు. చెక్ పోస్ట్ వద్ద ఫారెస్ట్, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల అధికారులు విధులను నిర్వహించాలన్నారు. చెకోపోస్టు వద్ద ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు.