ఒంగోలు అర్బన్: వ్యర్ధాల ప్రాసెసింగ్ ను వేగవంతం చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jul 31, 2026
వ్యర్ధాల ప్రాసెసింగ్ ను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. శుక్రవారం ఆయన ఒంగోలు నగర శివారులోని గుత్తికొండవారిపాలెం గ్రామంలో ఉన్న వ్యర్ధాల డంపింగ్ యార్డును పరిశీలించారు. నగరంలో ప్రతిరోజూ సేకరించిన వ్యర్ధాలను ఇక్కడ ప్రాసెసింగ్ చేస్తున్న తీరును ప్రత్యక్షంగా వీక్షించారు. కొన్ని ఏళ్ల నుంచి వ్యర్ధాలను ఇక్కడ డంపింగ్ చేస్తున్నామని, 2.56 లక్షల టన్నులు పేరుకుపోయాయని అధికారులు ఆయనకు తెలిపారు. వీటిలో ఇప్పటివరకు 1.76 లక్షల టన్నుల వ్యర్థాలను ప్రాసెసింగ్ చేశామని వివరించారు. ఈ ప్రక్రియలో వచ్చే ఆర్.డీ.ఎఫ్.ను సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నామని అన్నారు