పొన్నూరు: వయోవృద్ధులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి: నిడుబ్రోలు ప్రాథమిక వైద్యశాల సూపరింటెండెంట్ ఫిరోజ్ ఖాన్
వయోవృద్ధులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటానికి ప్రతిరోజూ యోగా, వ్యాయామాలు చేయాలని నిడుబ్రోలు ప్రాథమిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఫిరోజ్ ఖాన్ సూచించారు. బుధవారం నిడుబ్రోలు వైద్యశాలలో జరిగిన ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వృద్ధుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యులు వివిధ ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు.