అల్లూరి జిల్లా జిల్లా సమగ్ర అభివృద్దే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలి: పాడేరులో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలపై దృష్టి సారించాలని, అల్లూరి సీతారామరాజు జిల్లా సమగ్ర అభివృద్దే లక్ష్యంగా అధికార యంత్రాంగం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేసారు. మంగళవారం రాత్రి పాడేరులోని జిల్లా కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. పీజీఆర్ఎస్ లో పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనికి ఆహార పధకం పనులు ఎలా మంజూరు చేయాలో ప్రణాళికలు వేసుకోవాలన్నారు. చేసిన పనులు పూర్తి నాణ్యత ఉండేలా చూడాలన్నారు