మద్దిపాడులో రూ. 5 కోట్ల భయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను సంతనూతలపాడు శాసనసభ్యులు BN విజయ్ కుమార్ శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆదేశించారు. అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి, పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి, నాణ్యతగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ అధికారులు, సచివాలయ సిబ్బంది, టిడిపి నాయకులు పాల్గొన్నారు.