వ్యవసాయ,టెక్స్‌టైల్ రంగాలపై అమెరికాసుంకాలను నిరసిస్తూ కోడికొండ చెక్పోస్ట్లో వ్యవసాయ కార్మిక సంఘం ట్రంప్ దిష్టిబొమ్మ దహనం
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని చిలమత్తూరు మండలం కోడికొండ చెక్ పోస్ట్ లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అమెరికా ప్రభుత్వం భారత ఉత్పత్తులపై విధించిన 50% సుంకాలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ట్రంప్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, అమెరికా విధించిన సుంకాలు భారత రైతులు, టెక్స్‌టైల్ కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ఉత్పత్తి ఖర్చులు పెరిగి, ఎగుమతులు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించే ఈ నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే వ్యతిరేకించి అమెరికాపై