అదిలాబాద్ అర్బన్: గ్రామాలకు త్రీ ఫేస్ కరెంట్ ఇచ్చేందుకు అటవీ, విద్యుత్ అధికారులతో కలెక్టర్ సమావేశం
ఆదిలాబాద్ జిల్లా అటవీశాఖ, విద్యుత్ అధికారులతో కలెక్టర్ రాజర్షి షా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలకు త్రీ ఫేస్ కరెంట్ ఇచ్చేందుకు అటవీ శాఖ, విద్యుత్ శాఖ అధికారులు ఆయా గ్రామాలలో సర్వే నిర్వహించాలన్నారు. గ్రామాల్లో త్వరితగతిన జాయింట్ సర్వే నిర్వహించి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.